ANDHRABREAKING NEWSCRIMESPORTSSTATE

యోగ ఛాంపియన్స్ కర్నూల్ జట్టు

యోగ ఛాంపియన్స్ కర్నూల్ జట్టు

కర్నూలు స్పోర్ట్స్, జూన్ 20, (SK1 NEWS HD) :

ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నంద్యాల జిల్లాల యోగా పోటీల్లో విజేతగా కర్నూలు జట్టు 110 పాయింట్లతో చాంపియన్షిప్ను  కైవసం చేసుకుంది.100 పాయింట్ తో నంద్యాల జిల్లా జట్టు రెండో స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సెపక్ తాక్ర సంఘం సంయుక్త కార్యదర్శి జి. శ్రీనివాసులు,పెద్ద పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వేణుగోపాల్,రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి హాజరై గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు వ్యక్తిగత బహుమతులను బహుకరించారు.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాకారులు విధిగా పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యం కనబర్చిన అప్పుడే ఉత్తమ క్రీడాకారులుగా రాణించవచ్చు అన్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూల్ జుల్లా నుంచి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తుండడం హర్షణీయమన్నారు.అందుకు కృషి చేస్తున్న జిల్లా సంఘం నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, జిల్లా యోగా సంఘం ప్రతినిధులు హరి ప్రసాద్ నాయుడు,కళ్యాణి, విజయ్ కుమార్, ఈశ్వర్ నాయుడు, ప్రసన్న, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు ఇవే..

సబ్ జూనియర్ బాలుర విభాగంలో హర్షవర్ధన్, చతుర్వేది,నిఖిల్ రెడ్డి, అర్షద్ అయాన్ లు మొదటి నాలుగు స్థానాల్లో నిలివగా
బాలికల విభాగంలో.. గురు ప్రీతి,సాత్విక, విశ్వా శరణ్య,కవితలు వరుసగా నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు.
జూనియర్ బాలుర విభాగంలో..ధన ధీరజ్, అశ్వక్,యశ్వంత్ లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.బాలికల విభాగంలో.. కే.పల్లవి, తస్లీమా,తన్వీర్ ఫాతిమా, మనస్వినిలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు.
యూత్ బాలుర విభాగంలో..సాయి, ప్రకాష్,శరత్ లు మొదటి మూడు స్థానాల్లో నిలువగా,బాలికల విభాగంలో హరిణి, అక్షర, ఇంద్రాణి,పూజితలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో..ప్రసన్న,లలన ప్రియా, హరిప్రియ,గౌతమి లు వరుసగా నాలుగో స్థానంలో నిలవగా పురుషుల ఈ విభాగంలో విజయ్ కుమార్, మునిస్వామి, ఈశ్వర్, రంగస్వామి లు వరుసగా నాలుగు స్థానాలలో నిలిచినట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి ప్రకటించారు.

Related Articles

Back to top button
error: Content is protected !!