ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

గంజాయి రవాణా చేస్తున్నఅంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్

నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకుటాస్క్ ఫోర్స్, నకేరేకల్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం తెల్లవారుజామున నకిరేకల్ పీఎస్‌ పరిధిలోని నగేష్ హోటల్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే (AP 39 MZ 8970) నెంబరు గల వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి రవాణా వెలుగు చూసింది.వీరి వాహనంలో నుంచి గంజాయి ప్యాకెట్లు (60) స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Related Articles

Back to top button
error: Content is protected !!