ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATEWORLD

వెల్దుర్తిలో బుక్ కీపర్ ల మాయాజాలం

_’స్త్రీ నిధి’ నిధులు గుటకాయ స్వాహా

_ఆందోళనకు సిద్ధమవుతున్న పొదుపు గ్రూపు మహిళలు

_బుక్ కీపర్ ల పై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు

వెల్దుర్తి, జనవరి 08, (SK1 NEWS HD) :

ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం శక్తితో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పొదుపు గ్రూపులను ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళుతోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పొదుపు గ్రూపుల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు, స్త్రీనిధి నుండి రుణాలు, ఉన్నతి పథకం నుండి రుణాలు ఇవ్వడం జరుగుతోంది. బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న పొదుపు మహిళలు రుణం చెల్లించడానికి పొదుపు గ్రూపు లీడర్లు బ్యాంకుకు వెళ్లి చెల్లిస్తారు. స్త్రీ నిధి, ఉన్నతి పథకం ద్వారా తీసుకున్న రుణాలను పొదుపు మహిళలు బుక్కు కీపర్లకు అందజేస్తారు. బుక్ కీపర్ లు పొదుపు మహిళల ద్వారా తీసుకున్న సొమ్మును నిర్ణీత సమయంలో సంబంధిత బ్యాంకులో జమ చేయవలసి ఉంటుంది. శ్రీనిధి కంతులు 24 నెలలుగా ఉంటుంది. ఇందులో పొదుపు మహిళలు 23 కంతులు ఎటువంటి ఆటంకములు కలగకుండా కట్టిన వారికి 24వ కంతు కట్టనవసరం లేదనేది చర్చ కొనసాగుతోంది. కానీ మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఐ జి నగర్ 14వ వార్డులో ఇద్దరు బుక్కు కీపర్లు పొదుపు మహిళల నిరక్షరాస్యతను, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయాజాలం సృష్టిస్తున్నట్లు సమాచారం. ఒక బుక్ కీపర్ కు 20 పొదుపు గ్రూపులు ఉండగా, మరో బుక్ కీపర్ కు 29 పొదుపు గ్రూపులు ఉన్నాయి.వీరు చాలా సంవత్సరములుగా బుక్ కీపర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పొదుపు మహిళలు స్త్రీ నిధి రుణాలు బుక్కు కీపర్ లకు చెల్లించిన సమయంలో వారు తప్పకుండా రసీదులు ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఈ ఇద్దరు బుక్కు కీపర్లు రుణాలు చెల్లించిన ఏ ఒక్క పొదుపు మహిళలకు నేటి వరకు రసీదులు ఇవ్వలేదని బహిరంగంగానే పొదుపు మహిళలు పేర్కొంటున్నారు. పొదుపు మహిళలు స్త్రీ నిధి రుణాలు బుక్కు కీపర్ లకు ఇవ్వగా వారు బ్యాంకులకు చెల్లించకుండా లక్షల రూపాయలను తమ సొంత ఖర్చులకు వాడుకున్నట్లు పొదుపు మహిళలు పేర్కొంటున్నారు. 24 కంతులు దాటిన తర్వాత తిరిగి రుణాలు తీసుకోవడానికి పొదుపు కార్యాలయానికి వెళ్లగా పొదుపు మహిళలు ఇంకా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలపడం జరుగుతోంది. ముఖ్యంగా పొదుపు మహిళలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తమ మర్యాదలను కాపాడుకునేందుకు ప్రతినెల నిర్ణీత సమయంలో రుణాలు చెల్లిస్తున్నారు. కానీ బుక్కు కీపర్లు వీరు చెల్లించిన రుణాలను జల్సాలు చేస్తే మరి వీరి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. సకాలంలో చెల్లించిన ఈ పొదుపు గ్రూపులకు బ్యాంకులు రుణాలు అందజేయడానికి ముందుకు వస్తాయి. బుక్కు కీపర్ ల మాయాజాలానికి ఆయా పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. బుక్ కీపర్ లు ఇద్దరు వేరు,వేరుగా లక్షల రూపాయలు గుటకాయ స్వాహా చేసినట్లు ఐజి నగర్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఈ ఇద్దరు బుక్ కీపరులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 నవంబర్ ప్రత్యేక జీవో రావడం జరిగింది. ముఖ్యంగా పొదుపు మహిళలకు పురుష బుక్కు కీపరులు తొలగించాలని ఆ నిబంధనలో ఉంది. మరి ఆ నిబంధనలు అధికారులు ఎందుకు తుంగలో తొక్కారో వారికే తెలియాలి. మూడు సంవత్సరములు నిరాటకంగా మూడు సంవత్సరములు విధులు నిర్వహించిన బుక్ కీపర్ లు గ్రామైక్య సంఘం ఆదేశాల మేరకు దిగిపోవలసి ఉంటుంది. ముఖ్యంగా సంబంధిత పొదుపు అధికారులు బుక్ కీపర్ లను రుణాలు రికవరీ చేయమని అడిగితే పొదుపు మహిళలు చెల్లించడం లేదని బుకాయిస్తున్నట్లు సమాచారం. పొదుపు మహిళలు బుక్కు గీతలను మీరు మేము ఇచ్చిన రుణాలు బ్యాంకులో చెల్లించారా అని అడిగితే చెల్లించినట్లు పొదుపు మహిళల వద్ద బుకాయింపులు. సంబంధిత అధికారులు నేరుగా పొదుపు మహిళల వద్దకు వెళితే మేము బుకిపరులకు చెల్లించామని చెప్పడం గమనార్హం. ఇన్ని పచ్చి నిజాలు తెలిసినా వీరి ఇద్దరిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వెల్దుర్తి 14 వ వార్డులో గల ఇలాహి గ్రూపు తీసుకున్న స్త్రీనిధి రుణాన్ని బుక్ కీపర్ కు పూర్తిగా చెల్లించడం జరిగింది. కానీ ఇలాహి గ్రూపు నేటి వరకు లక్ష రూపాయలు బ్యాంకుకు అప్పుగా ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అదేవిధంగా ఇంద్రధనస్సు గ్రూపు స్త్రీ నిధి రుణాలు పూర్తిగా బుక్ కీపర్ కు చెల్లించగా ఇంకా 71 వేల రూపాయలు బ్యాంకుకు అప్పుగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అదేవిధంగా మనిషా గ్రూపు వారు స్త్రీ నిధి రుణాన్ని బుక్కు కీపర్ కు పూర్తిగా చెల్లించగా 76,000 అప్పుగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అదేవిధంగా మల్లీశ్వరి గ్రూపు లో ఒక పొదుపు సభ్యురాలు పేరిట ఉన్నతి రుణం 50 వేల రూపాయలు బుక్ కీపర్ తీసుకున్నట్లు వినికిడి.
మరో బుక్ కీపర్ కు దుబెరా భాను గ్రూపు స్త్రీనిధి రుణం 23 కంతులు చెల్లించగా 31 వేల రూపాయలు అప్పుగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అదేవిధంగా ఖాజాబీ పొదుపు లక్ష్మి గ్రూప్, లావణ్య గ్రూప్, అల్లాహు గ్రూప్ లను విచారిస్తే మరికొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా పొదుపు సంఘాల బుక్ కీపర్లు పొదుపు మహిళలు చెల్లిస్తున్న స్త్రీ నిధి రుణాలను వారి స్వప్రయోజనలకు వినియోగించుకుని గుటకాయ స్వాహాకు పాల్పడినట్లు ఐజి నగర్ లో ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు అధికారులు తీసుకొని బుక్ కీపర్లుగా మహిళలను ఏర్పాటు చేయాలని పొదుపు మహిళలు వేడుకుంటున్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!