ANDHRABREAKING NEWSCRIMESTATE

సస్పెన్షన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు

సస్పెన్షన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చ్ 02, (సీమకిరణం న్యూస్) :

 

ఏఎస్ పేట మండల కేంద్రం రహమతాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఖాజా నాయబ్ రసూల్ దర్గా మాజీ ముతవల్లి హఫీస్ పాషా పై సస్పెన్షన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు పొడిగించడం జరిగిందని దర్గా ఈవో హుస్సేన్ తెలిపారు గురువారం ఆయన దర్గాలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముతవల్లి హఫీజ్ భాష ను కొన్ని ఆరోపణల నేపథ్యంలో 10 రోజులపాటు సస్పెన్షన్ విధించారని ఆ సస్పెన్షన్ కొనసాగిస్తూ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వి.ఖాదర్ బాషా ఉత్తర్వులు జారీచేసినట్లు ఆయన తెలిపారు విచారణ అధికారిగా ఏ.కే. నజీర్ అడిషనల్ డైరెక్టర్ సిరి కల్చర్ డిపార్ట్మెంట్ వారిని నియమించారని ఆయన అన్నారు ప్రస్తుతం దర్గాలో అన్ని కార్యక్రమాలు తమ ఆధ్వర్యంలోని జరగనున్నట్లు ఆయన తెలిపారు తాము బాధ్యతలు తీసుకున్నప్పుడు దర్గా అకౌంట్లో 6 లక్షల 88,000 నగదు అన్నదానం అకౌంట్లో 43 వేల రూపాయలు ఉన్నట్లు ఆయన తెలిపారు విధి నిర్వహణలో పారదర్శకత, మిస్ యూస్ ఆఫ్ ఫండ్స్, లైంగిక వేధింపులు తదితర ఆరోపణలపై ఆయనను తొలగించామని సెక్షన్ 24 ప్రకారం 6నెలలపాటు విచారణ జరగనున్నట్లు తెలిపారు దర్గాకు వచ్చే భక్తులు ఎలాంటి అపోహాలు వదంతులు నమ్మకుండా నిర్భయంగా దర్గాకు వచ్చి దర్శనాలు చేసుకోవచ్చని ఈవో ఈ సందర్భంగా భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డ్ వైస్ చైర్మన్ షేక్ షౌకత్ అలీ, సెక్రటరీ షేక్ సంధాని భాష , జిల్లా సభ్యులు సయ్యద్ షాజహాన్, జిల్లా ఇన్స్పెక్టర్ షేక్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!